కొత్త రకుల్ ప్రీత్ నచ్చేస్తుంది...

Wednesday,July 10,2019 - 10:05 by Z_CLU

‘మన్మధుడు 2’ టీజర్ తరవాత సినిమా ట్రైలర్ ఎక్స్ పెక్ట్ చేశారంతా. కానీ స్పెషల్ గా రకుల్ ప్రీత్ క్యారెక్టర్ ని రివీల్ చేసి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ‘అవంతిక’ పేరుకే పద్ధతి… క్యారెక్టర్ మాత్రం అచ్చం హీరోలాగే…

చాలా స్పెషల్ అనిపించుకోనుంది రకుల్ ప్రీత్ క్యారెక్టర్ ‘మన్మధుడు 2’ లో. ఇప్పటి వరకు ఇలాంటి గ్లామరస్ చేయలేదా..? అంటే చేసింది కానీ.. ఇలా హీరోకి ఈక్వల్ గా.. ఓ రకంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా హీరోలాంటి క్యారెక్టరే చేయలేదు.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గతంలో నాగ్ క్యారెక్టర్ ని రిలీజ్ చేసినప్పుడు వాడిన ఫార్మాట్ లోనే రకుల్ క్యారెక్టర్ ని కూడా రివీల్ చేశాడు. ఆ టీజర్ లో కూడా నాగ్ అందరి ముందు సిన్సియర్ గా  ఉంటూ, ఆ తరవాత తన ఎగ్జాక్ట్ రోల్ ఏంటనేది తెలుస్తుంది. ఈ టీజర్ లో కూడా అంతే… అయితే రకుల్ ఈ కొత్త క్యారెక్టర్ లో అదిరిపోయిందనిపిస్తుంది.

మన్మధుడు 2 లో హీరోయిన్ అనగానే న్యాచురల్ గానే సోనాలిబింద్రే తో కంపారిజన్స్ క్రియేట్ అయ్యాయి… ఇప్పుడు ఈ కొత్త రకుల్ ప్రీత్ అవతార్ చూసి.. సినిమాని మరింత ఫ్రెష్ గా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్.