‘మన్మధుడే’ కాదు ‘డిస్కోరాజా’ కూడా అంతే...

Wednesday,July 10,2019 - 12:02 by Z_CLU

‘మన్మధుడు 2’ లో హీరోయిన్స్ కి కొదువ లేదు. రకుల్ ప్రీత్ సింగ్ నుండి బిగిన్ అయితే కీర్తి సురేష్ వరకు సినిమా సెట్స్ పై ఉన్నంత వరకు ఎవరో ఒకరు కన్ఫమ్ అవుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రవితేజ ‘డిస్కోరాజా’ లో కూడా అంతే అనిపిస్తుంది.

ఈ సినిమాలో ఇప్పటికే నభా నతేష్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ వరసలో ఇప్పుడు తన్యా హోప్ కూడా చేరనుంది. దీంతో ‘డిస్కోరాజా’ టైటిల్ కి తగ్గట్టే సినిమా కూడా కలర్ ఫుల్ కానుందనిపిస్తుంది.

పాయల్ రాజ్ పుత్ రెగ్యులర్ గ్లామరస్ రోల్ లో కాకుండా, ఈ సినిమాలో పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుంది. అయితే ఇప్పుడీ తాన్యా హోప్ పేరు కూడా ‘డిస్కోరాజా’ తో కనెక్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది.

తాన్యా హోప్ తో ఈ సినిమాలోని హీరోయిన్స్ నంబర్ 3 కి చేరింది. ఈ వరసలో ఇంకా ఎవరైనా చేరనున్నారా..? అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది.