ఆ ముగ్గురితో ఎన్టీఆర్ ఫిక్స్...

Sunday,May 21,2017 - 11:30 by Z_CLU

ప్రెజెంట్ ‘జై లవకుశ’ సినిమాతో సెట్స్ పై ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫీచర్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 27 వ సినిమా చేస్తున్న తారక్ మరో వైపు తన 28,29,30 సినిమాలకు సంబంధించి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ ను ఫైనల్ చేసేశాడట.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ ను కన్ఫర్మ్ చేసిన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరో సినిమాను కన్ఫర్మ్ చేసేశాడు. లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ తో బిగ్గెస్ట్ హిట్ అందించిన కొరటాల శివతో 29 వ సినిమాను కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ తన ప్రతిష్టాత్మక 30వ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం.. సో యంగ్ టైగర్ నెక్స్ట్ మూడు సినిమాలను ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేసుకున్నాడన్నమాట..