ఆ హీరోయిన్ తో 30 సినిమాలు చేయాలనుంది

Sunday,May 21,2017 - 12:01 by Z_CLU

టాలీవుడ్ లో ఓ హీరో హీరోయిన్ సూపర్ హిట్ అందుకొని హిట్ పెయిర్ అనిపించుకుంటే చాలు… ఇక వారిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను సెట్ చేసి మరో సారి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనీ చూస్తారు దర్శక నిర్మాతలు. ప్రెజెంట్ ఇలా టాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలు చేస్తూ ఆడియన్స్ ఎట్రాక్ట్ చేస్తున్న జంట రాజ్ తరుణ్-హెబ్బా పటేల్..

ఆ మధ్య ‘కుమారి 21’ సినిమాతో మెస్మరైజ్ చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత ‘ఆడో రకం-ఈడో రకం’ సినిమాతో మరో సారి ఎంటర్టైన్ చేసి మరో సూపర్ హిట్ ను తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసందే. రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన ఈ జంట త్వరలోనే అందగాడు సినిమాతో మరో సారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది..

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే హెబ్బా గురించి మాట్లాడాడు రాజ్ తరుణ్.. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ “హెబ్బా తో ఇప్పటికే మూడు సినిమాలు చేశాను.. హీరోగా కో-ఆర్టిస్ట్ తో కంఫర్ట్ గా నటించడం చాలా ముఖ్యమని..ఆ కంఫర్ట్ నాకు హెబ్బా కి మధ్య ఉండడంతోనే ఆడియన్స్ మా పెయిర్ కి బాగా ఎంటర్టైన్ అవుతున్నారని భావిస్తున్నా. తనతో మరో 30 సినిమాలు చేయాలనీ ఉంది” అన్నాడు రాజ్ తరుణ్.