NTR30 అప్ డేట్స్ చెప్పిన ఎన్టీఆర్

Monday,February 06,2023 - 12:47 by Z_CLU

Jr NTR gives an update on NTR30 , he requested fans to stop asking updates continuously

 

RRR లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత కొరటాల డైరెక్షన్ లో  సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ NTR. ఈ కాంబో సినిమా NTR30 గా తెరకెక్కనుంది. ఎనౌన్స్ మెంట్ వచ్చిన నెలలవుతుంది. తాజాగా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతుందో మాత్రం ఫ్యాన్స్ కి క్లారిటీ లేదు. దీంతో ప్రొడక్షన్ హౌజ్ పై సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అప్ డేట్స్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అవుతూ ఫ్యాన్స్ కి అప్ డేట్స్ అందించి వారిని రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన తారక్ ఫ్యాన్స్ కి షూటింగ్ అప్ డేట్స్ చెప్పాడు. ” ఫిబ్రవరిలో సినిమా పూజా కార్యక్రమలతో ప్రారంభం కానుంది. మార్చ్ 20 లేదా అంతకంటే ముందే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రకటించినట్టే వచ్చే ఏడాది రిలీజ్” అంటూ ఎన్టీఆర్ తెలిపాడు.

ఇకపై అప్ డేట్స్ గురించి ప్రొడక్షన్ హౌజ్ పై ఒత్తిడి చేయవద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు తారక్ . ఏదైనా అప్ డేట్ ఉంటే తన భార్య కంటే ముందే ఫ్యాన్స్ తో పంచుకుంటానని ఈ సందర్భంగా తెలిపాడు. ఎన్టీఆర్ ఇచ్చిన అప్ డేట్ క్లారిటీతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics