అందులో నిజం లేదు – ఎన్టీఆర్

Thursday,September 21,2017 - 11:01 by Z_CLU

ప్రస్తుతం ఒక్కో సినిమాను ఒక్కో డిఫరెంట్ జోనర్ లో ప్లాన్ చేస్తూ సినిమా సినిమాకు సరికొత్త వేరియేషన్ చూపిస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్న ఎన్టీఆర్ లేటెస్ట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోయే సినిమాపై వచ్చిన ఓ వార్తను రూమర్ అంటూ కొట్టిపడేశాడు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ నటించబోయే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదని వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని , ఇప్పటి వరకూ త్రివిక్రమ్ సినిమాలో చూడని ఓ రేంజ్ యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందని… అందుకే తారక్ ఈ సినిమా కోసం మలేషియా వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోబోతున్నడని, అంతే కాదు తారక్ ఈ సినిమా కోసమే డిటాక్సిఫైన్ ట్రీట్ మెంట్ కూడా చేయించుకోబోతున్నాడనేది ఆ వార్త..

లేటెస్ట్ గా ‘జై లవ కుశ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న యంగ్ టైగర్ ఈ వార్త పై క్లారిటీ ఇచ్చాడు. అసలు ఆ వార్తలో నిజం లేదంటూ తేల్చి చెప్పిన యంగ్ టైగర్ ఆ సినిమాకు తను ఓ డిఫరెంట్ లుక్ అనుకుంటున్నానని, ఇంకా త్రివిక్రమ్ తో కలిసి ఆ లుక్ గురించి చర్చించాలని చెప్పుకొచ్చాడు.