రిలీజ్ కి రెడీ అవుతున్న 'అదిరింది'

Thursday,September 21,2017 - 12:43 by Z_CLU

అట్లీ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక సినిమా ‘మెర్సల్’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘అదిరింది’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానుంది. తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో తెన్నాండల్ స్టూడియోస్ సంస్థతో కలిసి నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు మేకర్స్.

విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంతా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య , నిత్యామీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి, భజరంగీ భాయిజాన్ వంటి భారీ సినిమాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే తెలుగులో ఆడియోను రిలీజ్ చేసి అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.