NTR బయోపిక్ - జ్యూక్ బాక్స్ రివ్యూ

Saturday,December 22,2018 - 12:27 by Z_CLU

నిన్న గ్రాండ్ గా జరిగింది NTR బయోపిక్ ఆడియో లాంచ్. ఈ ఈవెంట్ లోనే రిలీజైన ట్రైలర్ అంచనాలకు మించి ఆకట్టుకుంది. అయితే ఈ బయోపిక్ లో సందర్భానుసారంగా ఉండబోయే పాత పాటలను ఎక్కడా రివీల్ చేయకుండా, ఫోకస్ మొత్తం NTR సినిమా, పొలిటికల్ కరియర్ పై పెట్టిన మేకర్స్, సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే 7 సాంగ్స్ ని రిలీజ్ చేశారు. వాటి రివ్యూ…

 

కథానాయక : ఈ బయోపిక్ నుండి రిలీజైన ఫస్ట్ సాంగ్. ఈ    సినిమా  నుండి ఏ అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని, టోటల్  గా మెస్మరైజ్ చేసిన సాంగ్ ఇది. సినిమాలో టైటిల్ కార్డ్ పడేటప్పుడు ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటని, K. శివదత్త, డా. K. రామ కృష్ణ కలిసి  రాశారు.

 

వెండితెర దొర : NTR అంటేనే నిలువెత్తు గాంభీర్యం. అది వెండితెర పైనే అయినా రియల్ లైఫ్ లో అయినా. నటుడిగా హైయెస్ట్ రేంజ్ కి రీచ్ అయిన NTR లైఫ్ లో కూడా స్ట్రగుల్ మూమెంట్స్ ఉన్నాయా..?  ఈ క్వశ్చన్ కి అవునేమో అన్న ఆలోచనని రేకెత్తిస్తుంది ఈ పాట. మేకర్స్ ఈ సాంగ్ ని ఏ సిచ్యువేషన్ లో ప్లాన్ చేసుకున్నారో తెలీదు కానీ, ‘కథానాయకుడు’ లో చాలా మందికి తెలియని ఇమోషనల్ ఎపిసోడ్ ఉండబోతుందని తెలుస్తుంది. కీరవాణి స్వయంగా రాసుకుని మరీ ఈ పాట పాడటం విశేషం.


బంటురీతి కొలువు : సాంగ్ లిరిక్స్ ని బట్టి ఇది బాలయ్య, విద్యా బాలన్ కాంబినేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ పోస్టర్స్ లో అదుర్స్ అనిపించుకున్న ఈ ఆన్ స్క్రీన్ NTR, బసవ తారకమ్మలు… ఈ సాంగ్ లో ఎంతలా మెస్మరైజ్ చేస్తారోనన్న  క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది ఈ పాట. K.S. చిత్ర, శ్రీనిధి తిరుమల కలిసి పాడిన ఈ పాటని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు.

కథానాయక : జ్యూక్ బాక్స్ లోని ఫస్ట్ సాంగ్, కైలాష్ ఖేర్ పాడిన ఈ సాంగ్ రిపీటెడ్ మోడ్ లో ఎందుకు ప్లాన్ చేసుకున్నారో సినిమా చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ పాటని శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు, రమ్య బెహరా కలిసి పాడారు.

మహానాయకుడు – రామన్న కథ : ‘మహానాయకుడు’ లోని ఫస్ట్ పాట. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో  రాజకీయ ప్రవేశం చేసిన NTR ని కీర్తిస్తూ ఉండబోయే పాట. ‘చక్రం’ తిప్పే నాయకుడై రానున్నాడు’ అనే లిరిక్స్ ఆనాడు తెలుగు ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశల్ని ఎలివేట్ చేస్తుంది. కీరవాణి లిరిక్స్ రాసిన ఈ సాంగ్ ని K.S. చిత్ర, సునీత కలిసి పాడారు.

చైతన్య రథం : నటుడిగా హయ్యెస్ట్ రేంజ్ ని చూసిన NTR రాజకీయాల్లోకి రావాలని చైతన్య రథమెక్కిన సందర్భంలో ఉండబోయే సాంగ్ ఇది. తెలుగు ప్రజలకు సరైన గౌరవం దక్కటం లేదన్న కారణంతో, ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన NTR ఆవేదనని వ్యక్తపరుస్తుంది ఈ సాంగ్. బహుశా ఇది పొలిటికల్ క్యాంపెన్ సందర్భంలో ఉండబోతుందేమో. ఈ పాటని కీరవాణి, కాళభైరవ కీర్తి సగాతియా, సాయి శివాని కలిసి పాడారు. సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు.


రాజర్షి : ఈ బయోపిక్ నుండి రిలీజైన సెకండ్ సాంగ్ ఇదే. శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాళ భైరవ, శ్రీనిధి తిరుమల కలిసి పాడిన ఈ పాట, NTR అభిమానుల్ని మరింత ఇమోషనల్ ఫేజ్ లోకి నెట్టింది.

అల్టిమేట్ గా NTR బయోపిక్ పై మరిన్ని అంచనాలు పెంచేసింది ఈ జ్యూక్ బాక్స్. కీరవాణి కంపోజ్ చేసిన పాటలే ఈ స్థాయిలో ఉంటే సినిమాలో, BGM ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేంతలా మెస్మరైజ్ చేస్తుంది ఈ జ్యూక్ బాక్స్.