ఎన్టీఆర్-కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్

Thursday,January 10,2019 - 06:55 by Z_CLU

అన్నీ తానై నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన సినిమా ఎన్టీఆర్-కథానాయకుడు. సంక్రాంతి కానుకగా నిన్న వరల్డ్ వైడ్ రిలీజైన ఈ సినిమా తొలిరోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

బాలకృష్ణ కెరీర్ లో మొన్నటివరకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఉండేది. ఇప్పుడా రికార్డును ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా అధిగమించింది. ఏపీ, ఓవర్సీస్, నైజాంలో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు గుంటూరు, నైజాం నుంచి భారీ వసూళ్లు రావడం విశేషం.

నైజాంలో కథానాయకుడు సినిమాకు తొలిరోజు కోటి 75 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు గుంటూరులో ఏకంగా 2 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దీంతో పాటు సీడెడ్, ఉత్తరాంధ్రలో చెరో 85 లక్షల రూపాయల షేర్ రాబట్టింది ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కించిన ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.