NTR బయోపిక్ కోసం రానా చేసిన హోమ్ వర్క్

Friday,January 04,2019 - 12:02 by Z_CLU

ఒక క్యారెక్టర్ ని తన స్టైల్ లో నటించడం వేరు, ఏకంగా ఇంకొకరి పాత్రని అదే స్టైల్ లో ప్రెజెంట్ చేయడం వేరు. అందుకే రెగ్యులర్ సినిమాల కన్నా బయోపిక్స్ లో నటించడమంటే చాలెంజింగ్ గా తీసుకుంటారు యాక్టర్స్. అలాంటి చాలెంజే ఫేస్ చేశాడు రానా NTR బయోపిక్ కోసం. ఈ సినిమా చేయడానికి సెట్స్ పైకి రాకముందే సరిపడా హోమ్ వర్క్ చేశాడు.

‘రీసెంట్ గా ఒక డిస్కర్షన్ లో ‘షూటింగ్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కలవడం వల్ల, ఆయనలా నటించడం కొంచెం ఈజీ అనిపించింది అని చెప్పుకున్నాడు. ఆ మీటింగ్ కి ముందు క్రిష్, నేను చేయాల్సిన రోల్ గురించి ఏదైతే చెప్పాడో, అదే ఆయన కూడా చెప్పడంతో, 2 రకాలుగా సింక్ అయింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉండకపోతే, ఈ రోల్ ప్లే చేయడం ఇంకా కష్టమయ్యేది’ అని చెప్పుకున్నాడు.

ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ లో రానా రోల్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు కానీ, కంప్లీట్ గా NTR పొలిటికల్ కరియర్ చుట్టూ ఉండబోయే ‘మహానాయకుడు’ లో మాత్రం కీ స్పేస్ లో కనిపించనున్నాడు రానా. జనవరి 9 న ‘కథానాయకుడు’, ఫిబ్రవరి 7 న ‘మహానాయకుడు’ రిలీజవుతున్నాయి. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ ని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు.