NTR అరవింద సమేత టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,August 09,2018 - 06:12 by Z_CLU

NTR త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అరవింద సమేత’ టీజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా  ఆగష్టు  15 న  ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు ఫిలిమ్ మేకర్స్. ఈ విషయాన్ని ఈ రోజే సోషల్ మీడియాలో కన్ఫం చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసిన ఫిలిం మేకర్స్, ఈ టీజర్ తో ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత రేజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో NTR ని డిఫెరెంట్ ప్రెజెంట్ చేయనున్నాడు త్రివిక్రమ్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా స్టోరీలైన్ కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ టీజర్ లో ఎలాంటి అంశాలు రివీల్ చేస్తారో చూడాలి.

అటు NTR మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న అరవింద సమేత చుట్టూ రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి.

ఈ సినిమాలో NTR సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.