2018 మోస్ట్ మెమోరబుల్ సాంగ్ - పెనివిటి

Friday,December 28,2018 - 10:02 by Z_CLU

సాంగ్స్ సూపర్ హిట్టయితే ఆ ఎఫెక్ట్ సినిమా సక్సెస్ పై కూడా పడుతుందా…? ఎగ్జాక్ట్ గా ఆన్సర్ చెప్పడం కష్టం కానీ, సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉండబోతుందా…? లేక ఈసారి కనీసం ఊహకు కూడా అందని అద్భుతమేదైనా చూడబోతున్నామా అనే వైబ్స్ మాత్రం డెఫ్ఫినెట్ గా క్రియేట్ చేస్తాయి. సరిగ్గా సెకండ్ క్యాటగిరీ కే వస్తుంది ‘పెనివిటి’ సాంగ్.

పెనివిటి సాంగ్ కి ముందు అరవింద సమేత సినిమాపై క్రియేట్ అయిన అంచనాలు వేరు. రిలీజ్ తరవాత ఫిక్స్ అయిన ఒపీనియన్ వేరు. అసలు తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఏం చూడబోతున్నాం..? అనే క్యూరియాసిటీని రేజ్ చేసింది ఈ సాంగ్. మరీ ముఖ్యంగా పాటలోని లిరిక్స్ కి కంటతడి పెట్టని మ్యూజిక్ లవర్ ఉండడు.

ప్రత్యర్థులపై కక్షతో ఇల్లు వదిలిన భర్త కోసం భార్య చూసే ఎదురు చూపులను అక్షరాలతో కళ్ళకుకట్టారు రామజోగయ్య శాస్త్రి గారు. ‘చిమ్మటి చీకటి.. కమ్మటి సంకటి… ఎర్రగా కుంపటి, వెచ్చగా దుప్పటి… అంటూ పరిసరాల్లోని ప్రతి వస్తువు తన రాక కోసం ఎదురు చూస్తుందని చెప్పడంలో, కవిగా శాస్త్రి గారు ఈ పాట రాయడానికి ఆ భార్య కన్నీటి వేదనను ఎంతగా ఫీలై ఉంటారనేది మళ్ళీ అక్షరాల్లో అర్థమయ్యేటట్టు చెప్పడం కొంచెం కష్టమే.

 

పల్లవి చివర ‘గుండెనే గొంతు చేసి పాడతాంది రారా పెనివిటి’ అని క్లోజ్ అయ్యే లిరిక్స్, మళ్ళీ అదే ఫార్మాట్ లో రెండు  చరణాల్లోనూ, ‘తాళిబొట్టు తలుచుకుని రారా పెనివిటి…’ అని ఓ సారి ‘నువ్వు కన్న నలుసునైనా తలుచుకుని రారా పెనివిటి..’ అంటూ ఇమోషనల్ గ్రాఫ్ ని పెంచిన విధానం ఈ పాటని మోస్ట్ మెమోరబుల్ సాంగ్ గా నిలబెట్టింది.

ఈ ఏడాది వచ్చిన  పాటల్లో అత్యుత్తమ సాహిత్యం ఈ పాటలోనే కనిపించింది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. రామ జోగయ్య శాస్త్రి గారి కెరీర్ లో ఈ పాటది ఓ ప్రత్యేక స్థానం.