గోవాలో శైలజా రెడ్డి అల్లుడు...

Thursday,August 09,2018 - 05:26 by Z_CLU

ఆగష్టు 31 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘శైలజా రెడ్డి అల్లుడు’. అయితే ప్రస్తుతం ఈ సినిమా గోవాలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ కాంబినేషన్ లో ప్రస్తుతం డ్యూయట్ చిత్రీకరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు మారుతి. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 18 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేసుకోనున్న ఫిలిమ్ మేకర్స్, మరోవైపు ఫాస్ట్ పేజ్ లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు.

ఈ సినిమాలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యువెల్ ఈ సినిమాలో హీరోయిన్.