అరవింద సమేత... NTR నానమ్మ పెట్టిన కండిషన్

Wednesday,October 10,2018 - 12:39 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది అరవిందసమేత. ఈ సినిమాకి చేయాల్సినంత రీసర్చ్ చేసి మరీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వచ్చిన త్రివిక్రమ్, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా కథకి, కథలోని పాత్రలకు బానిసలైపోయాం అని చెప్పుకున్నాడు. అందుకే ఆ పాత్రలకు తగ్గ నటులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ సినిమాలో NTR నానమ్మ గా నటించిన సుప్రియా పాఠక్ విషయంలో మాత్రం అలా జరగలేదట.

ఈ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు NTR ఏ మాత్రం ఆలోచన లేకుండా ఈ క్యారెక్టర్ సుప్రియా పాఠక్ అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. దాంతో ఇమ్మీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేస్తే, ఒక్కమాటలో యస్ అని చెప్పేసిందట. కానీ ఒక కండిషన్ మీద…

ఈ సినిమాలో నటించడానికి  చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పుకున్న సుప్రియా పాఠక్, తనకు భాష రాదు కాబట్టి స్క్రిప్ట్ ముందుగానే ఇచ్చేయాలి, స్క్రిప్ట్ తో పాటు, భాష నేర్పడానికి మనిషిని కూడా పంపాలని చెప్పిందట. దాంతో ఆవిడ డెడికేషన్ కి ఇంప్రెస్ అయిన ఫిల్మ్ మేకర్స్, ఇమ్మీడియట్ గా ఆవిడ చెప్పినట్టు చేశారట.

 అంత డెడికేటెడ్ గా చేసింది కాబట్టే, ట్రైలర్ లో ఆవిడ చెప్పిన ఒక్క డైలాగ్ కే, ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. దానికి తోడు సినిమాలో కూడా NTR కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ లో సుప్రియా పాఠక్ రోల్, మరింత ఎలివేట్ కానుందని తెలుస్తుంది.