కమల హాసన్ - విశ్వరూపం 2 అనుభవాలు

Thursday,August 09,2018 - 07:23 by Z_CLU

2013 లో రిలీజయింది కమల్ హాసన్ విశ్వరూపం. హాలీవుడ్ స్థాయి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరవాత ఇమ్మీడియట్ గా విశ్వరూపం 2 సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చిన కమల్ హాసన్, ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  అయితే విశ్వరూపం 2 సినిమా తెరకెక్కించే ప్రాసెస్ లో 5 ఏళ్లలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు కమల హాసన్.

అదే నిజం : సినిమాలో మోస్ట్ ఇంటెన్సివ్ టెక్నికల్ ఎలిమెంట్స్. చాలా రిస్కీ షాట్స్ తీశాము ఈ సినిమాలో. కానీ నిజం చెప్పాలంటే నాకు కానీ, మా టీమ్ కి కానీ ఆన్ సెట్స్ ఒక్క గాయం కూడా కలగలేదు. సినిమా కోసం ఏం చేసినా  ప్రొఫెషనల్ ట్రైనర్స్ సమక్షంలో చేశాం. నేర్చుకుని చేశాం.

అదీ మేం పడ్డ కష్టం : ఒక చిన్న కార్ క్రాష్ ఐడియా వచ్చినా ప్రతీది ముందుగా ప్లాన్ చేసుకుని ఫిక్సయ్యే వాళ్ళం. మేం అనుకున్నది జరగాలంటే లొకేషన్ లో చెట్టు ఉండాలి.. చెట్టు కోసం ఏం చేయాలి..? చెట్టు దొరికాక ఆర్టిస్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలి. కంప్యూటర్ ని ఈ షాట్స్ కోసం ఎలా వాడాలి..? స్టోరీ బోర్డ్ దగ్గరి నుండి సేఫ్టీ వరకు ప్రతీది పక్కాగా చేసుకుని సెట్స్ కి వెళ్ళే వాళ్ళం.

అది మాత్రం హిస్టరీనే  :  వహీదా రెహమాన్ గారితో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆవిడతో పని చేయడం హిస్టరీ లాంటిది. అటు సెట్స్ పై, ఆ తర్వాత డబ్బింగ్ జరిగేటప్పుడు ఆవిడతో చాలా టైమ్ స్పెండ్ చేయగలిగే అవకాశం దక్కింది. ఆవిడకి హెల్ప్ చేసినప్పుడల్లా ఆవిడ నన్ను గురుదత్ తో పోల్చినప్పుడు చాలా హ్యాప్పీగా ఫీలయ్యేవాడిని…

అది నా డ్రీమ్ : విజు మహారాజన్ గారితో పని చేయాలన్నది నా 32 ఏళ్ల కల. ‘సాగర సంగమం’ సినిమా చేస్తున్నప్పడు కలిసి పని చేద్దాము అనుకున్నాం. కానీ ఆ తరవాత కుదరలేదు. ఇప్పడు ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులకు డ్యాన్స్ చేయడం నిజంగా కల నెరవేరిన ఫీలింగ్ అనిపించింది.