NTR ‘అరవింద సమేత’ టైటిల్ వెనక కథ

Wednesday,October 10,2018 - 03:01 by Z_CLU

‘అరవింద సమేత’ టైటిల్ ఫిక్సవ్వడానికి రీజన్ ఏంటో రివీల్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రివిక్రమ్, అసలు ఈ టైటిల్ ఫిక్సవ్వడానికి ముందు జస్ట్ ‘అరవింద’ అనుకున్నారట. కానీ త్రివిక్రమ్ కి అప్పటికీ ఏదో ఇన్ కంప్లీట్ ఫీలింగ్ ఉండిపోయిందట. అదే రోజు మరో షాట్ కంప్లీట్ చేసిన గ్యాప్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే కంప్లీట్ టైటిల్ తట్టిందట త్రివిక్రమ్ కి. అయితే ఈ టైటిల్ కి కరెక్ట్ జస్టిఫికేషన్ కూడా తన మాటల్లో ఇచ్చాడు త్రివిక్రమ్.

“భగవంతుడి ఉగ్ర స్వరూపాన్ని కూల్ డౌన్ చేయడానికి పక్కన అమ్మవారి పేరు పెడతాం.. సీతా సమేత శ్రీరాముడు అని, లక్ష్మీ సమేత నరసింహస్వామి అని… అలాగే వీర రాఘవుడి కోపాన్ని, ఆ ఆగ్రహాన్ని శాంతింపజేయాలి, రాఘవుడిగా మార్చాలంటే అరవిందని జత చేయాలి. అందుకే అరవింద సమేత వీర రాఘవ.” అని చెప్పుకున్నాడు త్రివిక్రమ్.

మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది అరవింద సమేత. పూజా హెగ్డే ఈ సినిమాలో NTR సరసన అరవిందలా కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.