అరవింద సమేత సక్సెస్ మీట్

Friday,October 12,2018 - 02:23 by Z_CLU

నిన్న రిలీజైన అరవింద సమేతకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్. తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్ సీస్ లోను దుమ్ము లేపుతుందీ సినిమా. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు దిల్ రాజు, సునీల్ తమ మనసులో మాటలు చెప్పుకున్నారు.

గౌరవాన్ని తెచ్చిపెట్టింది – త్రివిక్రమ్

ఈ సినిమా నాకు ఎంతో గౌరవాణ్ణి తెచ్చి పెట్టింది. అందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది NTR గారికే. నా కన్నా ఆయనే కథను ఎక్కువగా నమ్మారు. ఆయన మార్క్ సాంగ్ నంబర్స్ ఉండవు. కథను కథలాగే జెన్యూన్ గా చెప్తున్నాం. ఎంతవరకు రీచ్ అవుతుందో అని నేను కొద్దో గొప్పో కంగారు పడ్డా, ఆయన మాత్రం ఫస్ట్ నుండి అంతే నమ్మకంగా ఉన్నారు.

అందుకే ఇది క్లాసిక్ అంటున్నా – సునీల్

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే అది ఖచ్చితంగా యాక్షన్ సినిమా. కానీ ఆ యాక్షన్ సినిమానే ఫ్యామిలీ సినిమాగా మార్చేశాడు. అల్టిమేట్ గా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశాడు. అందుకే ఈ సినిమాను క్లాసిక్ అంటున్నా.

మళ్ళీ మాట్లాడుకుందాం – దిల్ రాజు

గత రెండు, మూడు నెలలుగా ఫిలిమ్ ఇండస్ట్రీ మంచి హిట్ కోసం వెయిటింగ్ లో ఉంది. ఫస్ట్ షో నుండే ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ దసరా సీజన్ లో అరవింద సమేత తప్పకుండా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనే అనుకుంటున్నా. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.