ఇటలీలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’

Saturday,September 22,2018 - 02:06 by Z_CLU

ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ‘అరవింద సమేత’ సినిమా యూనిట్. సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఫాస్ట్ పేజ్ లో ఫినిష్ చేసుకుంటున్న టీమ్, ఈ నెల 23 న యూరోప్ బయలుదేరనుంది. ఇటలీలో 3 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ఫిలిమ్ మేకర్స్, ఈ షెడ్యూల్ లో NTR, పూజా హెగ్డే లపై సాంగ్ తెరకెక్కించనున్నారు.

ఇటలీలో జరగనున్న ఈ షెడ్యూల్ తో అరవింద సమేత షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఇండియాకి వచ్చీ రాగానే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ మరింత పెంచనున్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కానున్న ‘అరవిందసమేత’  హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.