NTR అరవింద సమేత ఎట్రాక్షన్స్

Monday,October 08,2018 - 04:18 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అరవింద సమేత రిలీజ్ కి రెడీగా ఉంది. యంగ్ టైగర్ NTR గత 12 ఏళ్లుగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్న కోరిక ఇన్నాళ్ళకు తీరింది. అక్టోబర్ 11 న భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమా, ఫ్యాన్స్ కి చాలా చాలా స్పెషల్. రిలీజ్ కి  వారం రోజుల  ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న అంశాలివే.

NTR: మోస్ట్ ఎఫెక్టివ్ ఎట్రాక్షన్. 2 డిఫెరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు NTR. ఓ వైపు రొమాంటిక్ హీరోగా, మరోవైపు తన మార్క్ మాస్ హీరోగా… ఇవి జస్ట్ ఈ సినిమా ట్రైలర్ లో రివీల్ అయిన శాంపిల్స్ మాత్రమే. అసలు సినిమా అక్టోబర్ 11 నుండి బిగిన్ అవుతుంది.

త్రివిక్రమ్ : NTR తరవాత అరవింద సమేత విషయంలో నిలిచే ఎట్రాక్షన్ త్రివిక్రమ్. అయన సినిమాలంటేనే లావిష్ కాన్వాస్. NTR కి ఉన్న ఇమేజ్ ని స్టామినాని మైండ్ లో పెట్టుకుని మరీ, సెట్స్ పైకి వచ్చిన ఈ ఫిలిమ్ మేకర్ పై NTR ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

హీరోయిన్స్ : వరస టాప్ హీరోలతో నటించేస్తున్న పూజా హెగ్డే తో పాటు, తెలుగమ్మాయి ఈషా రెబ్బ NTR సరసన నటించారు. ఈ ఇద్దరూ NTR తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. వరస టాప్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తున్న పూజా హెగ్డే ఓ వైపు, ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ అనిపించుకున్న ఈషా రెబ్బ, సినిమాలో సూపర్బ్ గ్లామర్ ఎట్రాక్షన్స్.

మ్యూజిక్ : సినిమాపై అంచనాలను పెంచేసింది  ఈ సినిమా ఆల్బమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో NTR చెప్పినట్టే, తమన్ ప్రాణం పెట్టి కంపోజ్ చేశాడనడంలో ఏ మాత్రం   అనుమానం లేదు. ఈ సాంగ్స్ తో పాటు సినిమాలో BGM కూడా అదే స్థాయిలో ఉండబోతుంది.

స్టోరీలైన్ : త్రివిక్రమ్ సినిమాలంటేనే డామినేటింగ్ స్టోరీలైన్. ‘యుద్ధాన్ని ఆపేవాడే మగాడు, మొనగాడు..’ అనే పాయింట్ చుట్టూ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది.

సిక్స్ ప్యాక్ : ‘టెంపర్’ తరవాత మళ్ళీ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు NTR. ఈ సినిమాకి ముందు ట్రైనింగ్ తీసుకుని మరీ, సెట్స్ పైకి వచ్చిన  యంగ్  టైగర్, యాక్షన్ సీక్వెన్సెస్ లో  అదరగొట్టడం ఖాయం.

డైలాగ్స్ : త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అంటేనే  డైలాగ్స్ కి స్పెషల్ ప్లేస్. సిచ్యువేషన్ ఏదైనా,  త్రివిక్రమ్ మార్క్ ఎలివేట్ అయ్యేలా ఉండే డైలాగ్స్ డెఫ్ఫినేట్ గా సినిమాకి మరో ఎట్రాక్షన్.

సునీల్ : సునీల్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు. హీరోగా, కమెడియన్ గా మెస్మరైజ్ చేసే సునీల్, ఈ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్థాయి రోల్ లో నటించాడని తెలుస్తుంది.

యాక్షన్ : NTR మాసివ్ అవతరాన్ని ఎలివేట్ చేసే ఎలిమెంట్. జస్ట్ ట్రైలర్ కే ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.  అందుకే  ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : సినిమాలోని క్యారెక్టర్స్ దగ్గరి నుండి లొకేషన్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ వరకు నిర్మాత S. రాధాకృష్ణ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించడం, అరవింద సమేతకి మరింత  గ్రాండియర్ లుక్ ని ఇస్తుంది.