ఇంకా తగ్గని ‘గీతగోవిందం’ హవా

Saturday,September 22,2018 - 03:03 by Z_CLU

ఆగష్టు 15 న రిలీజయింది విజయ్ దేవరకొండ గీతగోవిందం. 50 రోజులకు దగ్గర పడుతున్న ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ప్రదర్శించడుతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లోనే కాదు, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ భారీగా వసూలు చేస్తుంది.

ఇప్పటికే తమిళనాడులో 1.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటకలో 4.7 కోట్లు వసూలు చేసింది. ఇకా సీడెడ్ లో 7 కోట్లు వసూలు చేసిన గీతగోవిందం, నైజాం, కృష్ణా ఏరియాల్లో 4 కోట్ల మార్క్ ని దాటింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇంకా యూత్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉంది.

పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిందీ సినిమా. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించింది.