సూపర్ హిట్ అయిన దేవదాస్ ట్రయిలర్

Saturday,September 22,2018 - 12:36 by Z_CLU

నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా ట్రయిలర్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పుడు మరోసారి అందరికీ తెలిసింది. ఈ సినిమా ట్రయిలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రయిలర్ కు 30 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇప్పటివరకు కనిపించని సరికొత్త గెటప్స్ లో దేవదాస్ ట్రయిలర్ లో నాగార్జునను, నాని కనిపిస్తున్నారు. విజువల్స్ తో పాటు నాగ్, నాని ఎప్పీయరెన్స్ ఫ్రెష్ గా ఉండడంతో ట్రయిలర్ సూపర్ హిట్ అయింది. అప్పటివరకు సింగిల్స్ తోనే హంగామా చేసిన ఈ సినిమా, ట్రయిలర్ విడుదలైన తర్వాత అంచనాల్ని రెట్టింపు చేసింది.

ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది దేవదాస్ చిత్రం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.