అరవింద సమేత ఆల్బమ్ సూపర్ హిట్

Saturday,September 29,2018 - 01:04 by Z_CLU

అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది NTR అరవింద సమేత. రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ఈ సినిమా సాంగ్స్ కి యూ ట్యూబ్ లో 22.7 మిలియన్ వ్యూస్ రికార్డ్ అయ్యాయి.

‘అరవింద సమేత’ ఆల్బమ్ నుండి మొట్టమొదటగా రిలీజైన పాట ‘అనగనగా…’ యూత్ ని ఫస్ట్ అవర్ లోనే ఫిదా అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ వీడియో 6.7 మిలియన్ వ్యూస్ ని రికార్డ్ చేసింది. ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో NTR ని రొమాంటిక్ ఆంగిల్ లో చూసే స్పేస్ కూడా ఉందని క్లారిటీ ఇచ్చింది ఈ సాంగ్.

‘అనగనగా’ తరవాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సాంగ్ ‘పెనివిటి’. ఈ సాంగ్ రిలీజ్ తరవాత ఈ సినిమా స్టోరీలైన్ పై కూడా ఫ్యాన్స్ లో డిస్కర్షన్స్ బిగిన్ అయ్యాయి. అంత ఎట్రాక్ట్ చేసిందీ సాంగ్. గంట గంటకి వ్యూస్ పెంచుకుంటున్న ఈ సాంగ్ ఇప్పటికే 6.8 మిలియన్ వ్యూస్ దాటింది.

ఈ 2 పాటల తరవాత రిలీజైన ‘యేడ పోయినాడో’ సాంగ్ 1.8 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ సాంగ్ లిరికల్ వీడియో, సిల్వర్ స్క్రీన్ పై మరింత ఎలివేట్ అవుతుందనే ఫీల్ ఆడియెన్స్ లో క్రియేట్ అయింది.

అక్టోబర్ 2 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకోనుంది అరవింద సమేత టీమ్. ఈ ఈవెంట్ లో సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను రివీల్ చేయనున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. త్రివిక్రమ్ డైరెక్టర్. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.