NTR ఇమోషనల్ స్పీచ్

Wednesday,October 03,2018 - 03:57 by Z_CLU

నిన్న గ్రాండ్ గా జరిగింది NTR అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్. తండ్రి మరణం తరవాత ఫస్ట్ టైమ్ ఈవెంట్ లో పాల్గొన్న NTR, చాలా ఇమోషనల్ గా మాట్లాడాడు. ఈ సినిమాకి తన లైఫ్ లో రీసెంట్ గా జరిగిన సంఘటనకి చాలా దగ్గర సంబంధముందేమో అని చెప్పుకున్న NTR, ఇప్పటి వరకు తన సినిమాల్లో ఎప్పుడూ, తండ్రి చితికి నిప్పంటించే సిచ్యువేషన్ పడలేదని, ఈ సినిమాలో అలాంటి సీన్ ఉంటుందని బాధగా చెప్పుకున్నాడు.

అరవింద సమేత గురించి మాట్లాడుతూ.. ‘యుద్ధం ఎవడైనా గెలవగలడు, కానీ ఆ యుద్ధాన్ని ఆపగలిగే వాడే మొనగాడు’ అని చెప్పుకున్న NTR, జీవితం విలువ తెలుసుకుని బ్రతకడమే ‘అరవింద సమేత’ తాత్పర్యం అన్నాడు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారని ఇమోషనల్ గా చెప్పుకున్నాడు.

అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది ఈ సినిమా. తమన్ మ్యూజిక్ కంపోజర్. పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. అక్టోబర్ 11 న ఈ సినిమా రిలీజవుతుంది.