అరవింద సమేత నుండి ‘అనగనగా’ సాంగ్ ప్రోమో...

Thursday,October 04,2018 - 06:34 by Z_CLU

NTR అరవింద సమేత ‘అనగనగా…’ సాంగ్ ప్రోమో రిలీజయింది. ఇప్పటికే ఈ సినిమా ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయింది. దానికి తోడు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై మరింత్ బజ్ ని క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాని మరింత రీచ్ అయ్యేలా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తున్న ఫిలిమ్ మేకర్స్ ‘అనగనగా..’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

సినిమాలో ఉన్న 4 పాటల్లో 2 పాటలు సినిమాలో సందర్భానుసారంగా ఉండేవే. అయితే తక్కిన 2 సాంగ్స్ మాత్రం  యూత్ ఫుల్ గా ప్లాన్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. మరీ ముఖ్యంగా ఈ ఆల్బం నుండి ఫస్ట్ రిలీజైన ‘అనగనగా’ సాంగ్ విజువల్స్ పై భారీ అంచనాలున్నాయి. వాటికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ మరింత మెస్మరైజ్ అయ్యేలా ఉంది ఈ సాంగ్ ప్రోమో. మరీ ముఖ్యంగా NTR స్టెప్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.