ఆ సినిమాను పక్కన పెట్టిన నితిన్

Wednesday,March 28,2018 - 04:32 by Z_CLU

రీసెంట్ గా రాజశేఖర్ తో PSV గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ దర్శకుడితో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో ఆ ప్రాజెక్టును పక్కనపెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. కొన్నాళ్లు ప్రయోగాలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు నితిన్.

ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ‘ఛల్ మోహన రంగ’ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నితిన్. అందుకే ఏప్రిల్ 17 నుండి సెట్స్ పైకి రానున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ప్రిపరేషన్స్ కూడా అప్పుడే బిగిన్ చేసేశాడు. పక్కా ప్లాన్డ్ గా షెడ్యూల్స్ పూర్తిచేసి,  జూలై 24న  రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

 

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో శర్వానంద్ తో స్కీన్ షేర్ చేసుకోనున్నాడు నితిన్. ఈ సినిమా కూడా మ్యాగ్జిమం జూన్, జూలై కల్లా సెట్స్ పైకి వచ్చేస్తుంది.  ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా వెంకీ కుడుములతో మరో సినిమాకి రెడీ అవుతాడు నితిన్.

ప్రస్తుతానికి కేవలం ఫన్ లోడెడ్ ఎంటర్ టైనర్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్న నితిన్ ఈ 3 సినిమాల తర్వాతైనా ప్రవీణ్ సత్తారు సినిమాతో సెట్స్ పైకి వస్తాడా..? లేదా..? అనేది చూడాలి.