నితిన్ సరసన హీరోయిన్ ఫిక్సయింది

Monday,April 22,2019 - 05:50 by Z_CLU

టెక్నికల్ గా చిన్న బ్రేక్ తీసుకున్నట్టు అనిపించినా ఈ గ్యాప్ లో ఏకంగా 3 సినిమాలు లైనప్ చేసుకున్నాడు నితిన్. అయితే ఈ 3 సినిమాల్లో ఫస్ట్ సెట్స్ పైకి వచ్చేది చంద్రశేఖర్ యేలేటి సినిమాతోనే. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసేసుకున్నారు మేకర్స్. ఫస్ట్ టైమ్ నితిన్ తో జోడీ కట్టనుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ సినిమాకి సంబంధించి ఎగ్జాక్ట్ డీటేల్స్ ఇంకా బయటికి రాలేదు కానీ ఆల్మోస్ట్ ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండొచ్చనే టాక్ నడుస్తుంది. రీసెంట్ గా ఈ స్టోరీ న్యారేషన్ విన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇమ్మీడియట్ గా ఓకె అనేసిందని తెలుస్తుంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై V. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.