62 గెటప్పులపై రేపు క్లారిటీ

Wednesday,March 28,2018 - 03:15 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ లో నిజంగానే బాలయ్య విశ్వరూపం చూడబోతున్నాం. ఈ సినిమా కోసం ఏకంగా 62 గెటప్పులు ట్రై చేయబోతున్నారట బాలకృష్ణ. ఇప్పటివరకు వెండితెరపై అత్యథిక గెటప్పులు కమల్ హాసన్ వే. దశావతారం సినిమాలో 10 గెటప్పుల్లో కనిపించాడు లోకనాయకుడు. ఇప్పుడు బాలయ్య ఏకంగా 62 గెటప్పుల్లో కనిపిస్తారట. ఈ మేటర్ లో నిజమెంతో రేపు తెలిసిపోతుంది.

ఎన్టీఆర్ బయోపిక్ లో తను వివిధ గెటప్పుల్లో కనిపించబోతున్నానని బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. కాకపోతే అవి ఎన్ని గెటప్స్, ఎవరి పాత్రలు అనేవి రేపు తెలుస్తాయి. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం సరిగ్గా 9 గంటల 42 నిమిషాలకు ఎన్టీఆర్ బయోపిక్ కు క్లాప్ కొట్టబోతున్నారు.

రామకృష్ణ సినీ స్టుడియోస్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ముహూర్తాన్ని స్వయంగా బాలయ్య ఫిక్స్ చేశారట. నిజానికి ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ప్రత్యేక అతిథులుగా అహ్వానించాలని బాలయ్య భావించారు. కానీ వాళ్లు రావడం లేదు.