రోమ్ లో నితిన్ ‘భీష్మ’

Thursday,December 19,2019 - 02:02 by Z_CLU

నితిన్ ‘భీష్మ’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రోమ్ లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో సాంగ్ తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో షూటింగ్ స్పాట్ లో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతుంది.

ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న మేకర్స్, సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా వేగం పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 27 న సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

వెంకీ కుడుముల ఈ సినిమాకి డైరెక్టర్. సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.