నితిన్ సినిమా అనౌన్స్ మెంట్ అప్పుడే
Sunday,March 24,2019 - 11:10 by Z_CLU
ఎవరూ ఊహించని కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు నితిన్. చంద్ర శేఖర్ ఏలేటి తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను స్వయంగా అనౌన్స్ చేసాడు నితిన్. అయితే ఎప్పటి నుండో నానుతున్న వెంకీ కుడుములతో చేయబోయే ‘భీష్మ’ సినిమా గురించి మాత్రం ఇంత వరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు నితిన్. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా..? అనే ప్రశ్న అందరిలో మొదలైంది.
నిజానికి నితిన్ ముందుగా ఈ సినిమానే అనౌన్స్ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఈ ఏడాదిలో చేయబోయే రెండో సినిమాను ముందు అనౌన్స్ చేసాడు. అయితే నితిన్ వెంకీ కుడుముల సినిమాను అనౌన్స్ చేయకపోవడానికి ఓ లెక్కుందట. ఈ సినిమాను మార్చ్ 30న తన పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో అనౌన్స్ చేయబోతున్నాడట.
ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సినిమాను పుట్టినరోజు అనౌన్స్ చేసి వాళ్ళను ఫుల్ ఖుషీ చేయాలని భావించాడట. అందుకే ఆ అనౌన్స్ మెంట్ ను వెనక్కి నెట్టి చంద్రశేఖర్ ఏలేటితో చేయబోయే సినిమాను అనౌన్స్ చేసాడని తెలుస్తోంది. సో నితిన్ నెక్స్ట్ అనౌన్స్ మెంట్ బర్త్ డే కే అన్నమాట.