హీరో నితిన్ ఇంటర్వ్యూ
Wednesday,February 24,2021 - 06:13 by Z_CLU
యూత్ స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బేనర్ పై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో హీరో నితిన్ మీడియాతో ముచ్చటించాడు… ఆ విశేషాలు నితిన్ మాటల్లోనే.
ఒక కమర్షియల్ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా
‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్’ అంగీకరించా. ఒక కమర్షియల్ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్ ఇయర్ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్ రావడంతో ‘చెక్’చిత్రీకరణ ఆలస్యమైంది.వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్ సినిమా, మరో డిఫరెంట్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. డిఫరెంట్ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్ యేలేటిగారు మాస్టర్ కాబట్టి ‘చెక్’ ఒప్పుకొన్నా.
ఫస్ట్ వేరే కథ
చంద్ర శేఖర్ ఏలేటి గారు ఫస్ట్ వేరే కథ చెప్పారు. స్క్రిప్ట్ లైన్ బావుంది. రెండు నెలలు ట్రావెల్ చేశాం. అయితే, ఆ స్క్రిప్ట్ మీద ఆయన అంత కాన్ఫిడెంట్‌గా లేరు. నాకూ అంత కాన్ఫిడెన్స్ రాలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్ తీసుకుని వచ్చి ‘చెక్’ స్క్రిప్ట్ చెప్పారు. లైన్ చెప్పగానే ఇన్‌స్టంట్‌గా నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్ లేవు. రొమాంటిక్, కామెడీ ట్రాక్స్ లేవు.

క్లైమాక్స్ హైలైట్
ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్ నేర్చుకుని ఎలా గ్రాండ్ మాస్టర్ అయ్యాడు? అనేది సినిమా. చంద్రశేఖర్ యేలేటిగారు కథ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్ నచ్చింది. లాస్ట్ 15 మినిట్స్ హైలైట్. అక్కడ యేలేటిగారి మార్క్ అంతా కనిపిస్తుంది.
వందమందికీ నచ్చింది
నా యాక్టింగ్ కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలామంది చూశారు. వందమంది చూస్తే, వందమందికీ నచ్చింది. అందరూ బావుందని చెప్పారు.
కామ్‌గా ఉండేవాడ్ని
సెట్‌కి వెళ్లాక యేలేటిగారు ఏం చెబితే అది ఫాలో అయ్యా. ‘భీష్మ’, ‘రంగ్ దే’ సెట్స్‌లో కాస్త జోవియల్‌గా ఉండేవాణ్ణి. ‘చెక్’ సెట్‌లో మాత్రం కామ్‌గా ఉండేవాడ్ని. జైలులో ఖైదీ క్యారెక్టర్ కాబట్టి సెట్ వాతావరణం అంతా డార్క్‌గా ఉండేది. షాట్ చేయడం, తర్వాత పక్కకి వెళ్లి కామ్‌గా కూర్చోవడం… అంతే!
కాంప్లిమెంట్స్ రావడం గ్రేట్.
ఇట్ ఫీల్స్ గ్రేట్. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి నుంచి కాంప్లిమెంట్స్ రావడం గ్రేట్.
చాలా బాగా నటించింది
ప్రియా ప్రకాష్ వారియర్ కి తెలుగులో ఇది తొలి సినిమా. చాలా బాగా నటించింది.
రొమాంటిక్ ట్రాక్ లేదు
రకుల్‌కి థ్యాంక్స్ చెప్పాలి. సినిమాలో తను లాయర్ రోల్ చేసింది. తనకు, నాకు మధ్య సాంగ్స్ లేవు. రొమాంటిక్ ట్రాక్ లేదు. ఓ మంచి క్యారెక్టర్‌లో నటించడానికి ముందుకు వచ్చింది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.
రెగ్యులర్ సినిమా కాదు
ఇటువంటి సినిమాను ప్రొడ్యూస్ చేయడం గ్రేట్. ఇది రెగ్యులర్ సినిమా కాదు. డిఫరెంట్ సినిమా. ఇటువంటి సినిమాలకు ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఓ పది కోట్లు లేదా కొంత పెడతారు. కానీ, భారీ బడ్జెట్‌తో సినిమా ప్రొడ్యూస్ చేసిన ఆనందప్రసాద్ గారు గ్రేట్ అని చెప్పాలి. సినిమా బాగా ఆడి వాళ్లకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను.
నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్ళారు
రీ–రికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్ళారు. ఆయన అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత ఆయనకి బాగా పేరొస్తుంది.

‘జయం’ తర్వాత
యేలేటిగారి స్టయిల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వేరు. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నా. తర్వాత ఈజీగా చేశా. ‘జయం’ తర్వాత అన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఈ సినిమాకే.
సీక్వెల్ చేసే ఐడియా ఉంది
సినిమాలో ఐటెమ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, కామెడీ ఎపిసోడ్స్ వంటివి ఏమీ ఉండదు. సినిమా అంతా కంటెంట్ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు చూశారు. వాళ్ళు కూడా డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఐడియా ఉంది. క్లైమాక్స్ చూస్తే మీకూ అర్థమవుతుంది.
మరో రెండు సినిమాలు
‘రంగ్ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్’ రీమేక్ షూటింగ్ సగం అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాం. మేలో ‘పవర్ పేట’ షూటింగ్ స్టార్ట్ చేస్తా. కుదిరితే ఆ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మరో సినిమాలు యాక్సెప్ట్ చేశా. ప్రజెంట్ ఉన్నవి రిలీజ్ అయ్యాక వాటి గురించి చెబుతా.