శరవేగంగా సాగుతున్న శ్రీనివాసకల్యాణం

Tuesday,April 17,2018 - 11:38 by Z_CLU

మొన్నటికిమొన్న అఫీషియల్ గా లాంచ్ అయింది ఈ ప్రాజెక్టు. లాంఛింగ్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. అదింకా నలుగురిలో నానుతుండగానే, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అరె.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా అని ఆశ్చర్యపోయేలోపే సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించారు.

చండీగఢ్ లో శ్రీనివాస కల్యాణం సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. హీరో నితిన్, హీరోయిన్ రాశిఖన్నా మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు పిక్చరైజ్ చేస్తున్నారు. దీంతోపాటు సినిమాకు సంబంధించిన ఇతర కీలక సన్నివేశాలు కూడా ఇక్కడే తీయబోతున్నారు.

ఇదొక ఎత్తయితే… నెక్ట్స్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందనేది మరో షాకింగ్ న్యూస్. అవును.. చండీగఢ్ తర్వాత అమలాపురంలో మరో షెడ్యూల్ బిగిన్ అవుతుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ టాకీ కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు.