శ్రీనివాస కల్యాణం.. ఛలో అమలాపురం

Tuesday,May 08,2018 - 11:38 by Z_CLU

నితిన్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా శ్రీనివాస కల్యాణం. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అమలాపురంలోని జరిగింది. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కూడా అమలాపురంలోనే ప్లాన్ చేశారు. వచ్చే నెలలో ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

మూవీకి సంబంధించి ఇప్పటికే చండీగఢ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది యూనిట్. హైదరాబాద్ లో ఈనెల 18 నుంచి ఓ 8 రోజుల పాటు మరో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత.. యూనిట్ అంతా కలిసి ఫైనల్ షెడ్యూల్ కోసం అమలాపురం వెళ్తుంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్, నందిత శ్వేత కూడా పాల్గొంటారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. గతంలో శతమానంభవతి లాంటి క్లీన్ ఎంటర్ టైనర్ తీసి, ఏకంగా నేషనల్ అవార్డు కొట్టింది ఈ దర్శకుడే. ఈ ప్రాజెక్టుకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.