‘భరత్ అనే నేను’ సెన్సార్ టాక్

Tuesday,April 17,2018 - 12:53 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ నిన్న ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ తో సెన్సార్ క్లియర్ అయింది. అయితే సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా మెయిన్ థీమ్ అగ్రికల్చర్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ పై ఉండబోతుంది. ఈ 3 సెక్షన్స్ లో ఉన్న లోటు పాట్లను CM భరత్ ఎలా సరిదిద్దాడు..? ఈ ప్రాసెస్ లో తీసుకునే డెసిషన్స్ సినిమా మెయిన్ థీమ్ అని తెలుస్తుంది.

మహేష్ బాబు ట్రెమండస్ పర్ఫామెన్స్ ఫ్యాన్స్ కి కొత్త కాకపోయినా, కైరా అద్వానీ, మహేష్ బాబు మధ్య ఉండబోయే లవ్ ట్రాక్ సినిమాలో ఫ్రెష్ ఫీలింగ్ కలిగించనుంది. దాంతో పాటు సినిమాలోని పీక్ సిచ్యువేషన్స్ లో దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, థియేటర్స్ నుండి బయటికి వచ్చాక కూడా మర్చిపోవడానికి టైమ్ పడుతుందంటున్నారు సెన్సార్ సభ్యులు.

‘శ్రీమంతుడు’ తరవాత సెట్స్ పైకి వచ్చిన ఈ కాంబినేషన్ పై ఫస్ట్ నుండే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడంలో ఏ మాత్రం ఫెయిల్ కాలేదు కొరటాల. తన మార్క్ స్టోరీ, డైరెక్షన్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా మెస్మరైజ్ చేయడమే టార్గెట్ పెట్టుకున్న కొరటాల విజన్ కి, సినిమాటోగ్రఫీ తో పాటు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఉన్న ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాని బ్లాక్ బస్టర్ క్యాటగిరీలో చేర్చడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.