శ్రీనివాస కల్యాణం రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 04,2018 - 11:31 by Z_CLU

నితిన్, రాశిఖన్నా, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా శ్రీనివాస కల్యాణం. ఈ సినిమాను ఆగస్ట్ 9న విడుదల చేస్తారంటూ 3 రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడదే నిజమైంది. ఇవాళ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అంతా ఊహించినట్టే ఆగస్ట్ 9నే థియేటర్లలోకి రానుంది శ్రీనివాస కల్యాణం

నిజానికి ఫిదా విడుదలైన జులై 21న శ్రీనివాసకల్యాణంను కూడా విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ కూడా దాదాపు జులై 20 (శుక్రవారం) అనే అనుకున్నారట. కానీ అప్పటికే ఆ తేదీకి కొన్ని సినిమాలు లైన్లో ఉండడం, ఆ టైమ్ కు శ్రీనివాసకల్యాణం రెడీ కాదనే అంచనా మధ్య ఆగస్ట్ 9కి ఫిక్స్ అయ్యారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోంది శ్రీనివాసకల్యాణం. శతమానం భవతి వంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత సతీష్ వేగేశ్న డైరక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీపై అంచనాలు బాగున్నాయి. దీనికితోడు ఇప్పటికే విడుదలైన స్టిల్స్, ఫస్ట్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నటీనటులు

నితిన్‌, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్, రాజేంద్ర ప్ర‌సాద్‌ త‌దిత‌రులు

టెక్నీషియన్స్

ఆర్ట్:  రామాంజ‌నేయులు

ఎడిటింగ్‌: మ‌ధు

సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్

సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌

నిర్మాణం: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

కధ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:   వేగేశ్న‌ సతీష్