నితిన్ "కల్యాణం" పోస్ట్ పోన్

Friday,May 18,2018 - 11:02 by Z_CLU

శతమానం భవతి లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన సతీష్ వేగేశ్న, ప్రస్తుతం నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను జులై 21న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా మూవీ పోస్ట్ పోన్ అయింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆగస్ట్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఫిదా సినిమా జులై 21న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో.. ఆ సెంటిమెంట్ ప్రకారం శ్రీనివాస కల్యాణంను కూడా జులై 21కే తీసుకురావాలని గట్టిగా ట్రైచేశాడు నిర్మాత దిల్ రాజు. కానీ అనుకొని కారణాల వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ మూవీకి సంబంధించి రేపట్నుంచి హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సారథి స్టుడియోస్ లో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి మరోసారి అమలాపురం వెళ్తుంది. అదే లాస్ట్ షెడ్యూల్. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందిత శ్వేత, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.