సెట్స్ పైకొచ్చిన శ్రీనివాస కల్యాణం

Saturday,March 17,2018 - 11:45 by Z_CLU

మొన్ననే ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ఓపెనింగ్ జరిపించారు. అదే రోజున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో కూడా విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. అలా అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అమలాపురంలో శ్రీనివాస కల్యాణం మొదటి రోజు షూటింగ్ జరిగింది. అమలాపురంలోకి పచ్చటి పంటపొలాల మధ్య ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్టు నితిన్ ట్వీట్ చేశాడు.

నితిన్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. గతంలో శతమానంభవతి లాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసింది ఇతడే. ఆ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా శ్రీనివాసకల్యాణం మూవీని తెరకెక్కిస్తున్నాడు.

దిల్ రాజు నిర్మాతగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోంది శ్రీనివాస కల్యాణం. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.