ఈ పదంలోనే ఓ మత్తు ఉంది.. ఆ గమ్మత్తు మీకోసం..

Tuesday,April 17,2018 - 10:03 by Z_CLU

పాటంటే ఉత్తేజం.. పాటంటే ఉల్లాసం.. పాటంటే జలపాతం.. అందుకే, మన సినిమాల్లో పాటలకు అంత ఇంపార్టెన్స్. అలాంటి పాటల్లో కొన్ని పదాలు సంగీత ప్రియుల మదిని దోచుకుంటాయి. సున్నితమైన గులాబీ రేకుల్లా హృదయాల్ని స్పృశిస్తాయి. పదం ఒకటే అయినప్పటికీ, వేర్వేరు పాటల్లో ఒదిగిపోయి, పాటకు పారవశ్యాన్ని ఆమోదిస్తాయి. అలాంటి పదాల్లో ఒకటి “ప్రియా..”. ఈ పదంతో మొదలయ్యే పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. వాటిలో హిట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అలా ప్రియా అనే పదంతో మొదలైన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ చూద్దాం.