ఎట్రాక్ట్ చేస్తున్న నితిన్ 'లై' టీజర్

Wednesday,July 12,2017 - 12:30 by Z_CLU

‘అ ఆ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ త్వరలోనే ‘లై’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

నితిన్ స్టైలిష్ లుక్, హను మేకింగ్ , మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది లై టీజర్. ముఖ్యంగా “కోట్ల మంది సైనికులు సరిపోలేదట, పంచ పాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడు ఒంటరి కాదట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తి అవ్వదట. అశ్వద్ధామ హతః….కుంజరః. అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

నితిన్‌ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయబోతున్నారు.