ఇంకా క్లారిటీ ఇవ్వని కింగ్

Wednesday,July 12,2017 - 02:05 by Z_CLU

ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేసే నాగార్జున, ఈసారి నో క్లారిటీ అంటున్నాడు. ఓంకార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజుగారి గది 2’ ఆల్మోస్ట్ పూర్తయింది. ఆగస్టు లో రిలీజ్ చేయాలని ప్లాన్. ఇలాంటి పొజిషన్ లో వెంటనే మరో సినిమా ఎనౌన్స్ చేస్తాడు నాగార్జున. కానీ ఈసారి మాత్రం కింగ్ క్లారిటీ ఇవ్వలేదు.

నాగ్ డైరక్టర్స్ లిస్ట్ లో మొన్నటివరకు చందు మొండేటి పేరు వినిపించింది. కానీ ఆ దర్శకుడు చైతూతో సినిమా చేయబోతున్నాడు. చందు కంటే ముందే లిస్ట్ లో కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు. ‘సోగ్గాడు చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ కథ సెట్ అవ్వలేదని స్వయంగా నాగ్ ప్రకటించాడు.

సో.. ప్రస్తుతానికి నాగార్జున చేతిలో ఉన్న సినిమా రాజుగారి గది-2 మాత్రమే. ఈ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తయిన తర్వాత కొత్త సినిమాపై నాగ్ ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.