నాగశౌర్యకి ‘అశ్వత్థామ’ ఎందుకంత స్పెషల్...?

Thursday,December 19,2019 - 02:30 by Z_CLU

దర్శకులు ఎలా చెప్తే అలా నటించే నాగశౌర్య ఫస్ట్ టైమ్ తన కథ తానే రాసుకున్నాడు. సినిమా కూడా సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతుంది. ఈ సినిమా తన కరియర్ లో చాలా స్పెషల్ అని కూడా చెప్పుకున్నాడు. అయితే ఇలా చెప్పుకోవడం హీరోలకు కొత్త కాదు కానీ, ఈ సినిమా టైటిల్ ని ఏకంగా ట్యాటూ వేయించుకున్నాడు నాగశౌర్య. ఈ సినిమా తనకి ఎందుకింత స్పెషల్…?

‘అశ్వత్థామ’ టైటిల్ ని ట్యాటూగా వేయించుకున్న విషయాన్ని పెద్దగ ఎక్కడా ప్రస్తావించలేదు నాగశౌర్య. కానీ ఈ టైటిల్ తో ట్యాటూ వేయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది. వీటి మధ్య న్యాచురల్ గానే ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

రీసెంట్ గా రిలీజైన ‘నిన్నే.. నిన్నే..’ సింగిల్ కూడా ఫ్యాస్స్ కి నచ్చేసింది. ఇప్పుడీ ట్యాటూ కూడా నెటిజన్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది. చూడాలి మరీ.. ఫ్యాన్స్ లో ఈ స్థాయిలో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తున్న ఈ ట్యాటూ స్టోరీని సినిమా రిలీజయ్యే లోపు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడో లేదో…