డబ్బింగ్ స్టార్ట్ చేసిన నితిన్

Thursday,September 12,2019 - 02:39 by Z_CLU

ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది ‘భీష్మ’ టీమ్. అయితే ఈ రోజు నుండే తన డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు నితిన్. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడు ఈ హీరో.

‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరవాత నితిన్ ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ క్యారెక్టర్ లో  ఎంటర్టైన్ చేయబోతున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. క్రిస్మస్ కానుకగా రిలీజవుతుంది ‘భీష్మ’.

టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసిన నితిన్, ఈ సినిమా విషయంలో మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు.