ఫోర్బ్స్ టాప్ 100 లో టాలీవుడ్ సెలెబ్రిటీస్

Thursday,December 19,2019 - 01:32 by Z_CLU

ఫోర్బ్స్ మేగజైన్ టాప్ 100 ఇండియన్ సెలెబ్రిటీస్ లిస్టు ప్రకటించింది. టాప్ ఫస్ట్ ర్యాంక్ విరాట్ కోహ్లీకి దక్కితే ఆ తరవాత వరసగా 2, 3 ర్యాంకుల్లో అక్షయ్  కుమార్, సల్మాన్ ఖాన్ లు నిలిచారు. అయితే ఈ టాప్ 100 లిస్టులో టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఉన్నారు.

ప్రభాస్ : రెబల్ స్టార్ ఈ ఏడాది 44 వ స్థానంలో నిలిచాడు. 2017 లో బాహుబలి జెనెరేట్ చేసిన మ్యాజిక్ తో 22 వ స్థానంలో నిలిచిన ప్రభాస్ ఈ ఏడాది 44 వ స్థానంలో ఉన్నాడు.

మహేష్ బాబు :  గత మూడేళ్ళుగా వరసగా ఫోర్బ్స్ మేగజైన్ టాప్ 100 నిలుస్తున్నాడు మహేష్ బాబు. 2017 లో 37, 2018 లో 33 వ స్థానాల్లో నిలవగా ఈ ఏడాది 54 వ స్థానంలో ఉన్నాడు సూపర్ స్టార్.

తాప్సీ : అటు బాలీవుడ్ సినిమా, ఇటు సౌత్ ఇండియన్ సినిమాల్ని బ్యాలన్స్ చేసుకుంటూ కరియర్ ప్లాన్ చేసుకుంటున్న తాప్సీ ఈ లిస్టులో 68 వ స్థానంలో నిలిచింది.

త్రివిక్రమ్ : తన కరియర్ లో ఫస్ట్ టైమ్ ఫోర్బ్స్ టాప్ 100 సెలెబ్రిటీ లిస్టులో  ర్యాంక్ దక్కించుకున్నాడు  త్రివిక్రమ్. ఈ ఏడాది 77 వ స్థానంలో ఉన్నాడు.