8 మిలియన్ వ్యూస్ ని దాటేసిన ‘నిన్నుకోరి’ ట్రేలర్

Monday,June 19,2017 - 07:03 by Z_CLU

నాని ‘నిన్నుకోరి’ ట్రేలర్ సోషల్ మీడియాలో బెస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రేలర్ అటు ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తూనే, సినిమాపై కావాల్సినంత క్యూరాసిటీని జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా ట్రేలర్ అప్పుడే యూ ట్యూబ్ లో 8 మిలియన్ వ్యూస్ ని రికార్డు చేసుకుందంటే ఈ సినిమా చుట్టూ రోజు రోజుకి ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.

 ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ‘నిన్నుకోరి’ సినిమా వైజాగ్ లోని మెయిన్ లొకేషన్స్ తో పాటు U.S. లోని రేర్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. గోపి సుందర్ మ్యూజిక్ ఇప్పటికే సినిమా సక్సెస్ గ్యారంటీ అనిపిస్తుంది. D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7 న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లోపు జూన్ 29 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.