నిన్నుకోరి ఆడియో రిలీజ్

Tuesday,June 27,2017 - 05:47 by Z_CLU

నాని ‘నిన్నుకోరి’ ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజయింది. జూలై 7 నుండి థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమాలోని  మొదటి 3 పాటలను ప్లాన్డ్ గా వన్ బై వన్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నాలుగో పాటతో కలిపి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసింది. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న క్యూరాసిటీ చూస్తుంటే, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇంటరెస్టింగ్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నాని అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ ఆడ్ అయినట్టే అనిపిస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మించాడు.