నాని నిన్నుకోరి సెన్సార్ రిపోర్ట్

Friday,June 30,2017 - 06:33 by Z_CLU

జూలై 7 న రిలీజ్ కి రెడీగా అవుతున్న ‘నిన్నుకోరి’ సెన్సార్ క్లియరయింది. నాని, నివేద థామస్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆది కీ రోల్ ప్లే చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ప్యాకప్ చెప్పేసి రెడీ టు రిలీజ్ మోడ్ లో ఉన్న ‘నిన్ను కోరి’ సెన్సార్ ఫార్మాలిటీస్  కంప్లీట్ చేసుకుని ‘U’ సర్టిఫికెట్ పొందింది.

వైజాగ్ తో పాటు U.S. లోని ఇంటరెస్టింగ్ లొకేషన్స్ లలో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ కి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. గోపీ సుందర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది.