ఆది చెప్పిన పవన్ కళ్యాణ్- చరణ్ సినిమా విశేషాలు

Monday,June 19,2017 - 06:05 by Z_CLU

లేటెస్ట్ గా ‘సరైనోడు’ సినిమాతో స్టైలిష్ విలన్ గా ఎస్టాబ్లిష్ అయిన ఆది పినిశెట్టి ఆ సినిమాలో వైరం ధనుష్ గా తన  పెర్ఫార్మెన్స్  తో అదుర్స్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా బడా సినిమాల్లో ఆఫర్స్ అందుకున్న ఆది లేటెస్ట్ గా మీడియా తో ముచ్చటించాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాతో పాటు రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఆది ఈ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఐడియాలజీ తో ఉండే ఓ నెగిటీవ్ క్యారెక్టర్ చేస్తున్నానని, తన కోసం త్రివిక్రమ్ గారు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేసారని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, అలాగే రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా షూట్ కి వెళ్తుంటే 1985 లో తాత వాళ్ళ ఊరు వెళ్తున్నట్టుందని, సుకుమార్ గారి ఐడియాస్, క్యారెక్టర్స్ నటుడిగా మెస్మరైజ్ చేస్తున్నాయని, ఈ సినిమాలో ఓ వెరైటీ గెటప్ తో ఉండే మరో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నా, ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నానని  ఈ రెండు సినిమాలు నటుడిగా తనను మరో మెట్టు పైకి తీసుకెళ్తాయని ఆశిస్తున్నానని ” తెలిపాడు ఆది…