జీ సినిమాలు ( 20th జూన్ )

Monday,June 19,2017 - 10:06 by Z_CLU

భద్రాద్రి

నటీనటులు : శ్రీహరి, రాజా, గజాల, నిఖిత

ఇతర నటీనటులు : బాలాదిత్య, ముకేష్ రిషి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ

డైరెక్టర్ : మల్లికార్జున్

ప్రొడ్యూసర్ : శివకుమార్

రిలీజ్ డేట్ : 6 మార్చి 2008

భద్రాది అనేది అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండే భద్రాద్రి ONGC వల్ల వచ్చే గ్యాస్ వల్ల, అక్కడి వాతావరణం కాలుష్యం అయి, దాదాపు స్మశానం లా  తయారవుతుంది. అప్పుడు రఘు రామ్ ( శ్రీ హరి ) ఏం చేశాడు..? తన ఊళ్ళో పరిస్థితులు బాగు చేయడానికి శ్రీహరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

దీపావళి

నటీ నటులు : వేణు తొట్టెంపూడి, ఆర్తి అగర్వాల్, మేఘా నాయర్

ఇతర నటీనటులు : ఆలీ, బ్రహ్మానందం, భానుచందర్, వినోద్ కుమార్

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : హరిబాబు

ప్రొడ్యూసర్ : తీగల కృపాకర్ రెడ్డి

వేణు, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ దీపావళి. యమగోల మళ్ళీ మొదలైంది లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్ తరవాత వేణు నటించిన ఫీల్ గుడ్ చిత్రమిది. బ్రహ్మానందం కామెడీ సినిమాకి పెద్ద ప్లస్. హరిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.

=============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

============================================================================

 

గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

==============================================================================

శివపురం

నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్

ఇతర నటీనటులు : మనోజ్ K జయన్, కళాభవన్ మణి, బిజు మీనన్, రియా సేన్, కొచిన్ హనీఫా, సురేష్ కృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్

డైరెక్టర్ : సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005

పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

పాండవ వనవాసం

నటీనటులు : నందమూరి తారక రామారావు, సావిత్రి

ఇతర నటీనటులు : S.V. రంగారావు, కాంతారావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వర రావు, బాలయ్య, పద్మనాభం, మిక్కిలినేని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటసాల

డైరెక్టర్ :  కమలాకర కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : అడుసుమిల్లి ఆంజనేయులు

రిలీజ్ డేట్ : 14 జనవరి 1965

నందమూరి తారక రామారావు, సావిత్రి, S.V. రంగారావు నటించిన అద్భుత మైథలాజికల్ చిత్రం పాండవ వనవాసం. కమలాకర కామేశ్వర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాని అడుసుమిల్లి ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హైలెట్ గా నిలిచింది.