ఓవర్సీస్ లో నేచురల్ స్టార్ రికార్డులు

Friday,July 14,2017 - 06:03 by Z_CLU

న్యాచురల్ స్టార్ ‘నిన్నుకోరి’ పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డొమెస్టిక్ తో పాటు ఓవర్ సీస్ లోను మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న నాని సినిమాలు ఓవర్ సీస్ లోను సత్తా చాటుతున్నాయి. సెన్సిటివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘నిన్నుకోరి’ వారం రోజుల్లోనే  మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ‘ఈగ’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’ సినిమాల తరవాత నాని కరియర్ లో మిలియన్ డాలర్స్ రీచ్ అయిన నాలుగో సినిమా నిన్ను కోరి.

ఓవర్సీస్ తో పాటు డొమెస్టిక్ మార్కెట్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘నిన్నుకోరి’ సక్సెస్ ని ప్రేక్షకులతో సెలబ్రేట్ చేసుకోనుంది సినిమా యూనిట్. ఈ నెల 16 న విజయవాడ బందర్ రోడ్ లోని  A-1 కన్వెన్షన్ సెంటర్ లో ‘నిన్నుకోరి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్’ నిర్వహించనుంది సినిమా యూనిట్.

నాని సరసన నివేత థామస్ నటించిన ఈ సినిమాలో ఆది కీ రోల్ ప్లే చేశాడు. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ టూ ఎంటర్ టైనింగ్ గా సాగే ‘నిన్నుకోరి’ అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఇంప్రెస్ చేసేస్తుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ డైరెక్టర్.