రజినీకాంత్ 2.0 లో నెవర్ సీన్ బిఫోర్ ఎలిమెంట్

Tuesday,November 20,2018 - 01:34 by Z_CLU

ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 చుట్టూ భారీ స్థాయిలో క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది. రజినీకాంత్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో న్యాచురల్ గా క్రియేట్ అయ్యే క్రేజ్ ని పక్కన పెడితే, 2.0 లో మరింతగా ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ విజువల్ ఎఫెక్ట్స్. ఆ అంచనాలను మైండ్ లో పెట్టుకునే సినిమాని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు  ఫిల్మ్ మేకర్స్. 2.0 లో హాలీవుడ్ స్థాయిలో కంపోజ్ చేసిన 2,150 VFX షాట్స్ ఆడియెన్స్ ని నెవర్ సీన్ బిఫోర్ అనుభవాన్ని కలిగించనున్నాయి.

3000 కు పైగా VFX ఎక్స్ పర్ట్స్ ఈ సినిమాకి పని చేశారు. 3D టెక్నాలజీ తో 4D సౌండ్ సిస్టమ్ తో రిలీజవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో బర్డ్ మ్యాన్ గా కనిపించనున్నాడు. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఇప్పటికే రిలీజైన స్టిల్స్, వీడియోలు సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.

 నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్, ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని మించి ఎంటర్ టైన్ చేస్తుంది అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన 2.0 ని తెలుగులో NV ప్రసాద్, NVR సినిమా బ్యానర్ పై రిలీజ్ చేయనున్నారు.