28 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైమ్ – అక్షయ్ కుమార్

Monday,November 05,2018 - 11:15 by Z_CLU

నవంబర్ 3 న రిలీజయింది 2.0 ట్రైలర్. రజినీకాంత్ తరవాత ఈ సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విలన్ క్యారెక్టర్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. మరీ ముఖ్యంగా అక్షయ్ కుమార్ లుక్స్ విషయంలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన లుక్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకున్నాడు అక్షయ్ కుమార్.

“నా 28 ఏళ్ల కరియర్ లో నేనెప్పుడూ ఇంతగా కష్టపడలేదు. దాదాపు మూడున్నర గంటలు జస్ట్ మేకప్ వేసుకోవడానికే పట్టేది. ఇక తీయడానికి గంటన్నర. ఇన్నాళ్ళ నా సినిమా అనుభవం వేరు. 2.0 సినిమా ఇచ్చిన అనుభవం వేరు.” అని తన లుక్స్ విషయంలో తను పడ్డ కష్టం చెప్పుకుకున్నాడు అక్షయ్ కుమార్.

తనను ఫస్ట్ టైమ్ స్క్రీన్ పై ఈ లుక్స్ లో చూసినప్పుడు కాసేపటి వరకు షాక్ లో ఉండిపోయానని చెప్పుకున్న అక్షయ్ కుమార్, ఈ సినిమా తన లైఫ్ లో స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్పుకున్నాడు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. లైకా ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్. ఈ సినిమా నవంబర్ 29 న గ్రాండ్ గా రిలీజవుతుంది.